అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు , మంత్రి పొంగులేటి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, వినోద్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. సింగరేణిలో 1800 ఉద్యోగ నియామాకాలు చేపట్టామన్నారు. సింగరేణి ఉద్యోగాల్లో భర్తీ, కారుణ్య నియామకాల్లో కీలక మార్పులు చేపట్టామన్నారు. సింగరేణి కార్మికుల కోసం కోటి రూపాలయ భీమా పథకం ప్రారంభించామని చెప్పారు. చెన్నూరు, రామగుండంలో స్కిల్ డెవ్ లప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి కార్మికులను లాభాల్లో భాగస్వాములను చేశామని చెప్పారు శ్రీధర్ బాబు.
2023-24 సంవత్సరానికి గానూ సింగరేణికి రూ. 2412 కోట్ల లాభం వచ్చింది. అయితే లాభాల్లో 33 శాతం రూ. 796 కోట్లు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఒక్కో కార్మికుడికి లక్షా 90 వేలు బోనస్ రానుంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఒక్కో కార్మికుడికి 20 వేలు అదనంగా బోనస్ ఇస్తుంది సర్కార్. అలాగే ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల బోనస్ ఇస్తంది సింగరేణి యాజమాన్యం.