
ఉప్పల్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేటి యువ తరానికి స్ఫూర్తి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.ఉప్పల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. యువ ప్రధానిగా దేశానికి దశ, దిశ చూపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ స్టేడియంగా పేరు పెట్టారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పాల్గొన్నారు.