
కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. శుక్రవారం మంత్రి శ్రీధర్‌బాబు కరీంనగర్‌లో పలువురిని కలిసి నరేందర్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఓ ప్రైవేటు హోటల్‌లో అడ్వకేట్లు మంత్రిని కలిసి నరేందర్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా.నరేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలోని డాక్టర్లు పెద్దసంఖ్యలో పాల్గొని నరేందర్‌రెడ్డికి మద్దతు తెలిపారు.
మైనారిటీ సెల్ అధ్యక్షుడు తాజ్ ఆధ్వర్యంలో మైనారిటీ మేధావులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఇది ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అంజనీ ప్రసాద్, లక్ష్మారెడ్డి, నవాబ్, పాల్గొన్నారు.
నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
కరీంనగర్ సిటీ/హుజూరాబాద్ రూరల్/వేములవాడ/బోయినిపల్లి,వెలుగు: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు.
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మండల కో-ఆర్డినేటర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టులోని బార్ అసోసియేషన్‌లో, పట్టణంలోని పలు స్కూళ్లల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. బోయినిపల్లి మండలకేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.