సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం సమీపంలో బుధవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మర్కూక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన చందా కనకయ్య, మన్నే బాలరాజు
అతడి కొడుకు భాను ప్రసాద్ (8) తో కలిసి బైక్పై రోడ్డు దాటుతుండగా గజ్వేల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలు కాగా బాలుడి రెండు కాళ్లు విరిగాయి. పోలీసులు అతడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.