ఒక్క రూపాయి పోతే..రూ.100 తెచ్చే దమ్ముంది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కౌంటర్

ఒక్క రూపాయి పోతే..రూ.100 తెచ్చే దమ్ముంది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కౌంటర్

హైదరాబాద్, వెలుగు: తాము రాజకీయాలు చేయదలచుకోలేదని, ఒక్క రూపాయి పోతే 100 రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ముందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మన రాష్ట్రాన్ని తక్కువ చూపెట్టొద్దని సూచించారు. గురువారం అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్లకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కూడా పరిశ్రమలు గుజరాత్‌‌‌‌‌‌‌‌కు తరలిపోయాయని గుర్తుచేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే పాత ప్రభుత్వ విధానాలు మార్చమని చెప్పారని, కేటీఆర్ సత్య దూరమైన మాటలు మాట్లడొద్దని సూచించారు.