
రైతులపై బీఆర్ఎస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. గత పదేండ్లలో రైతుల్ని బీఆర్ఎస్ సర్కార్ నిండా ముంచిందన్నారు. వినోద్ ను గెలిపించినట్లే వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఎంపీ మనోడైతే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయని చెప్పారు. బెల్లంపల్లిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.యువకుడు, ఆలోచనపరుడైన వంశీని గెలిపించుకోవాలని కోరారు.
ఉద్యోగాలిప్పిస్తామని కేంద్రం మోసం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 20 కోట్ల జాబ్ లిస్తామని చెప్పి 6 లక్షలతో సరిపెట్టిందన్నారు. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ ను డెవ్ లప్ చేయాలన్న లక్ష్యంతో వంశీ ఉన్నారని చెప్పారు.
లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థల్ని మోదీ సర్కార్ అమ్మాకానికి పెడుతోందని మండిపడ్డారు శ్రీధర్ బాబు. బీజేపీ నేతలు రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. బ్లాక్ మనీనీ తీసుకొచ్చారా? పేదల అకౌంట్లో 15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను పట్టించుకునేది ఒక్క కాంగ్రెస్ సర్కారేనన్నారు. పెద్దపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎంతో మాట్లాడుతామన్నారు
కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పంట పరిహారం ఇచ్చాం.. మన్మోహన్ సింగ్ సింగ్ టైంలో రైతులకు రూ. 5 వేల సాయం చేశాం.. రుణమాఫీ చేశాం. రాహుల్ ప్రధాని అయితేనే మన సమస్యలు పరిష్కరించవచ్చు. పెద్దపల్లి ఎంపీ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుంది. అందుకే బూత్ స్థాయిలో కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తాం. కార్యకర్తల కష్టం వృధాగా పోదు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశాం. జూన్ 6 తర్వాత జాగలేనేళ్లకు జాగ..ఇళ్లు లేనోళ్లకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.