హైకోర్టుకు హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్..

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ పిటిషన్ పై ఇవాళ (సెప్టెంబర్ 27) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలని  గతంలో హైకోర్టు ఆదేశించడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.  

మహబూబ్‌‌నగర్‌‌ ఎమ్మెల్యే, మంత్రి వి. శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌‌పై సెప్టెంబర్ 23న విచారించిన హైకోర్టు.. సెప్టెంబర్ 29న అడ్వకేట్‌‌ కమిషనర్‌‌ నిర్వహించే క్రాస్‌‌ ఎగ్జామినేషన్‌‌కు హాజరుకావాలని మంత్రిని ఆదేశించింది.

ALSO READ : ఎంపీ నామా ఇంట్లో బీఆర్ఎస్ నేతల భేటీ

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌‌నగర్‌‌ ఓటర్‌‌ సీహెచ్‌‌ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ఎలక్షన్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు విచారించింది.