కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల పట్టికలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని క్రీడా, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందన్నారు. ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు తీసుకరావాలని క్రీడాకారులకు సూచించారు. ప్రోత్సాహిస్తే వారు రాణిస్తారని చెప్పారు. నాంపల్లిలోని TNGO కార్యాలయంలో కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతమైన ప్రతిభను కనబరచిన కుమారి నిక్కత్ జరీన్ (బాక్సింగ్), హుసాముద్దీన్ (బాక్సింగ్) క్రీడాకారిణి కుమారి ఇషా సింగ్ (షూటింగ్)లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోందని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారన్నారు.
దేశాన్ని విచ్చిన్నం చేయడానికి రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను తెలంగాణ ఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్. ఎం. హుస్సేని ముజీబ్ సన్మానించారు. TNGO హైదరాబాద్ శాఖ అసోసియేషన్ తరపున నిక్కత్ జరీన్ కు రూ. 3 లక్షలు హుసాముద్దీన్ కి రూ. 2 లక్షలు కుమారి ఇషా సింగ్ కు రూ. 2 లక్షల చెక్కులను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర TNGO అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, TNGO ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ TNGO శాఖ అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతమైన ప్రతిభను కనబరచి పతకాలు సాధించిన బాక్సింగ్ క్రీడాకారులు నిక్కత్ జరీన్, హుసాముద్దీన్, ఆకుల శ్రీజ, షూటింగ్ క్రీడాకారిణి ఇషా సింగ్ లను హైదరాబాద్ జిల్లా TNGO కార్యాలయంలో అభినందించడం జరిగింది. pic.twitter.com/98RHq7Z2jO
— V Srinivas Goud (@VSrinivasGoud) August 30, 2022
ఈ కార్యక్రమంలో రాష్ట్ర TNGO అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, TNGO ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, TNGO నాయకులు విక్రమ్, కొండల్ రెడ్డి, చంద్రశేఖర్, ఉమ, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/YhCIZBwsV1
— V Srinivas Goud (@VSrinivasGoud) August 30, 2022