వరంగల్ : పట్వారీ నుండి ప్రధానమంత్రిగా ఎదిగిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర లోని మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గృహంలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అనేక సంస్కరణలు చేపట్టిన పీవీ లాంటి గొప్ప వ్యక్తిని గుర్తించకపోవడం, ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయకపోవడం దౌర్భాగ్యమని అన్నారు.
వరంగల్ జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలతో పాటు వంగర గ్రామాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. పీవీ స్వగృహంలో ఆయన వాడిన వస్తువులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులతో పాటు తెలంగాణలోని ప్రతి పౌరుడు సందర్శించే విధంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.