వరంగల్, వెలుగు : వరంగల్ బస్టాండ్, కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి మాఢవీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి శనివారం హనుమకొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో వివిధ డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ, సీఎం అష్యూరెన్స్, జనరల్ ఫండ్ కింద చేపట్టిన డెవలప్‌మెంట్ వర్క్స్ ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో ఏయే పనులు చేపట్టాలన్న విషయంపై చర్చించారు. సమావేశంలో కుడా సీపీవో అజిత్‌రెడ్డి, డీఆర్డీఏ సంపత్‌రావు, బల్దియా ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌వో రాజేశ్, ఆర్డీవో వాసుచంద్ర, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కుడా ఈఈ భీమ్‌రావు, సెక్రటరీ మురళి పాల్గొన్నారు.