గత ప్రభుత్వ హయంలో యాదాద్రి దేవాలయంలో అభివృద్ధి పనుల పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్ర పరంగా తప్పని మంత్రి కొండా సురేఖ అన్నారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహం నిర్మిస్తోందని, వచ్చే మినీ జాతర నాటికి గెస్ట్‌హౌస్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిశ్, ఫారెస్ట్ఆఫీసర్రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అడిషనల్కలెక్టర్( స్థానిక సంస్థలు ) పి శ్రీజ , అడిషనల్కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.