హనుమకొండ ఐటీ పార్క్ పనులు మంత్రి ఆకస్మిక తనిఖీ

హనుమకొండ ఐటీ పార్క్ పనులు మంత్రి ఆకస్మిక తనిఖీ

హనుమకొండ : హనుమకొండలోని ఐటీ పార్క్ SPTI సెంటర్ ను ఎమ్మేల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. SPTI సెంటర్ లో ఉన్న యానిమేషన్, ఐటి ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. వర్క్ ఫ్రం హోం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ నిపుణులు ఉంటున్నారని మంత్రి అన్నారు. భవిష్యత్తు అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీదనే ఆధారపడి ఉందని, అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు ఐటీ శాఖ మంత్రి. 

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐటీ నిపుణులను తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు రూపొదింస్తుంది. Bfsi కోర్సులతో ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం దీనికోసం పట్టణాల్లోని కాలేజీల్లో bfsi, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నమని ఐటీ శాఖమంత్రి వివరించారు.