పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బషీర్ బాగ్ లోని ఫుల్ బాగ్ బస్తీలో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ , జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానికుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జాప్యం జరిగిందని తలసాని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కరెంట్, నీటి సరఫరా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరలో స్థానికులతో సమావేశమై నిజమైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తానని తలసాని హామీ ఇచ్చారు. బస్తీలో ఫంక్షన్ హల్ ను ఆధునీకరించడంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు మినీ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..