
హైదరాబాద్ : పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ కూల్చివేతపై విచారణ కొనసాగుతోందని చెప్పారు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజ్యాంగంలో పొందు పరిచిన అంశాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఆయన సూచించారు. అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు.
అంబేద్కర్ ఆశయాలు అందరూ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతుంటారని అన్నారు తలసాని. TRS ప్రభుత్వం వచ్చాకే గల్లీగల్లీలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించామన్నారు.
శనివారం ఉదయం పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేత ఘటనపై.. సీనియర్ IAS అధికారి ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కొనసాగుతోందని అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే గిట్టని వాళ్లు .. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి వేశారని తలసాని ఆరోపించారు.