
- హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఘటన
భైంసా, వెలుగు: నిర్మల్‌జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ రాజేశ్ బాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేయిచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముథోల్ సెగ్మెంట్ బీఆర్ఎస్లో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భైంసా ఏఎంసీ చైర్మన్రాజేశ్ బాబును మంత్రి కేటీఆర్రాజధానికి పిలిపించారు. అయితే, శనివారం హైదరాబాద్‌లో స్టీల్‌బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్వచ్చారు.
ఈ క్రమంలో కేటీఆర్వెనుక రాజేశ్ బాబు వెళ్తుండగా.. పక్కనే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోపోద్రిక్తుడయ్యారు. ‘నా కంటే ముందు వెళ్తావా?’ అంటూ రాజేశ్‌బాబు కాలర్‌పట్టి వెనక్కి లాగడమే కాకుండా చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉన్న రాజేశ్ పై మంత్రి దాడి చేయడంతో గిరిజన సంఘాలు, ఉద్యమకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్చేస్తున్నారు.