హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్‌లో జీహెచ్ఎంసీ అధికారులతో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలను కోరారు. మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోందన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.
నెక్లెస్ రోడ్ లోని బుద్ధ భవన్ లో GHMC నార్త్ జోన్ స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. pic.twitter.com/O7PnalzXrP
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 30, 2022
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్ కాకుండా నిమజ్జనం చేయాలని కోరారు.