జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల పునరుద్ధరణకు ప్రభుత్వం 6700 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇటీవల గోషామహల్ నియోజకవర్గం చక్నవాడిలో కుంగిపోయిన నాలా పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ నాలా నిర్మాణం కోసం కోటి 27 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. బేగంబజార్, ఉస్మాన్ గంజ్ మీదుగా 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నాలా నాణ్యత ప్రమాణాలను త్వరలో సమీక్షిస్తామని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా.. ఇతర అంశాలపై దృష్టి పెట్టడాన్ని మానుకోవాలని తలసాని హితవు పలికారు.