హైదరాబాద్: కులాలకు గతంలో ఎవ్వరూ నిధులు ఇవ్వలేదని.. ఇప్పుడు మాత్రం కేసీఆర్ అన్ని కులాల వారికి నిధులిస్తున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ మంత్రి పైవ్యాఖ్యలు చేశారు.
‘గతంలో మా కులానికి భవనం కట్టుకుంటా అంటే ఏ ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేవు. నేను 35 ఏళ్ళ నుంచి అసెంబ్లీలో ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తి కులాలకు న్యాయం చేశారు. మా కులానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు ఎకరాలు ఇచ్చారు. ఒక్కో ఎకరం భూమి ప్రస్తుతం రూ. 60 కోట్లకు అమ్ముడుపోతోంది. అన్ని కులాల వారికి సీఎం మేలు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు’ అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
For More News..