నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ లైఫ్ ఖతమేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడు పోయారని, ఆయన వల్లే ఇవాళ మునుగోడు బై పోల్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తమ్ముడికి ఓటేయాలని కోరుతూ సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
మునుగోడును సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని, ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడు మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.