సినీ ఇండస్ట్రీపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ, పుష్ప మూవీలతో సినీ పరిశ్రమ పుంజుకుందన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదన్నారు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందన్నారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చామన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు.
మరిన్ని వార్తల కోసం: