మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఏపీలో టీడీపీ క్యాడర్ డిమాండ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.. గత కొద్దిరోజులుగా టీడీపీ క్యాడర్ స్టార్ట్ చేసిన ఈ క్యాంపైన్ సోషల్ మీడియాలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య చిచ్చు రాజేసింది. ఇదిలా ఉండగా తాజాగా దావోస్ లో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ ఫ్యూచర్ లోకేష్ అని.. కాబోయే సీఎం కూడా లోకేషే అని భరత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ టీడీపీ క్యాడర్ చేస్తున్న క్యాంపెయిన్ పై పార్టీ అధిష్టానం సీరియస్ అయినా క్రమంలో టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని... లోకేష్ ఉన్నత విద్యావంతుడని, 175 మంది ఎమ్మెల్యేల్లో, 25మంది ఎంపీల్లో స్టాన్ఫర్డ్ లో చదివినోళ్లు లేరని అన్నారు భరత్. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న పార్టీ టీడీపీ అని.. పార్టీ భవిష్యత్ లోకేష్ అని, కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ అన్నారు మంత్రి భరత్.
మరి, కూటమిలో పొలిటికల్ హీట్ పెంచుతున్న లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో.. ఈ అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.