
బెంగళూరు: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కర్నాటక ఎక్సైజ్ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టులు చంపే వాళ్ల మతాన్ని అడగరని అన్నారు. ‘‘చంపాలని వచ్చిన వ్యక్తి ఎదుటి వారి కులం, మతం అడుగుతాడా? వస్తాడు.. షూట్ చేసి వెళ్లిపోతాడు. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. టెర్రరిస్టులు అక్కడ నిలబడి నీది ఏ మతం, ఏ కులం అని అడగరు. షూట్ చేసి పోతారు”అని అన్నారు. ఈ దాడిపై దేశమంతా కలత చెందిందని, అయితే, దీనిని మతపరమైన సమస్యగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.