రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి: మంత్రి తుమ్మల

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి: మంత్రి తుమ్మల
  • ఎరువుల పంపిణీపై మార్క్​ఫెడ్, హాకా ఆఫీసర్లకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎరువుల పంపిణీలో  రైతులకు ఇబ్బందులు, సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్ కు సరిపడా ఎరువులు ఉన్నాయని స్పష్టం చేశారు. మంగళవారం సెక్రటేరియెట్​లో మార్క్ ఫెడ్, హాకా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మల మాట్లాడుతూ..ఎరువుల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళికబద్ధంగా రైతులకు అందేలా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగ వృద్ధికి పాటుపడే ఎఫ్​పీడీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వ్యవసాయశాఖ కార్యక్రమాలకు హాకా తోడ్పాటు అందించాలని మంత్రి ఆదేశించారు.మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ యేడాది 42 కొనుగోలు కేంద్రాలు ఓపెన్​ చేసి..48,133 మంది రైతుల నుంచి 83,075 టన్నుల సోయాబీన్, 990 టన్నుల పెసళ్లను సేకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు నాఫెడ్​, ఎన్​సీసీఎఫ్..  రాష్ట్రంలో మార్క్​ఫెడ్​ ద్వారా కందులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.