బ్యాంకర్ల తప్పుల వల్లే రుణమాఫీ ఆలస్యం.. మంత్రి తుమ్మల

బ్యాంకర్ల తప్పుల వల్లే రుణమాఫీ ఆలస్యం.. మంత్రి తుమ్మల
  • మూడు బ్యాంకుల్లో డేటా మిస్​ కావడం వల్లే కొందరికి మాఫీ కాలే 
  • రూ.2 లక్షలకు పైబడిన లోన్లు 
  •  ఉన్నవాళ్లు బ్యాలెన్స్​అమౌంట్​ కట్టాలన్న మినిస్టర్​
  • ఇందుకోసం త్వరలోనే గైడ్​లైన్స్​ఇస్తామని ప్రకటన  

ఖమ్మం, వెలుగు : బ్యాంకర్ల తప్పుల కారణంగానే రుణమాఫీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని,  ఆ తప్పులను సరిదిద్ది 42 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. గత ఐదేండ్లలో పంట రుణాల వివరాలు ఇవ్వాలని 40 బ్యాంకులను కోరితే, 41 లక్షల78 వేల 897 మందికి రూ.31 వేల కోట్లు రుణాలు ఉన్నట్టు రిపోర్ట్​ ఇచ్చారని, దాని ఆధారంగానే ముందుకు వెళ్తున్నామన్నారు.

మూడు బ్యాంకుల్లో డేటా మిస్ కావడం వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారందరి వివరాలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెల్లరేషన్​ కార్డు ఉన్న వారికి ఇప్పటికే డబ్బులు జమయ్యాయని, కార్డు లేని వారికి కుటుంబ నిర్ధారణ చేసి,  మాఫీ చేస్తామన్నారు.  రూ.2 లక్షలకు పైబడి క్రాప్​ లోన్లు ఉన్నవాళ్లు  మీది బ్యాలెన్స్​ బ్యాంకులకు చెల్లిస్తే రూ.2 లక్షలను వాళ్ల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు.

ఇందుకోసం త్వరలోనే గైడ్​లైన్స్ ​ఇస్తామన్నారు. సాంకేతిక లోపాల కారణంగా 2.26 లక్షల మందికి సంబంధించిన రూ.24 కోట్లు రిటర్న్ వచ్చాయని తెలిపారు. లోన్లు మాఫీ అయ్యాక వెంటనే బ్యాంకర్లు రైతులకు మళ్లీ అప్పులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు.
 

ఆఫీసర్లు ఇండ్లకు వెళ్తున్నారు 

రేషన్ కార్డు లేని వారి కుటుంబాన్ని నిర్ధారించేందుకు ఈ నెల16వ తేదీ నుంచి అధికారులు, లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పరిశీలిస్తున్నారని మంత్రి తుమ్మల  చెప్పారు. సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతుల ఇండ్లకు కూడా వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుంటున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 46 లక్షల ఖాతాలకు 16 లక్షల ఖాతాలకి రూ.11 వేల కోట్లు మాత్రమే జమ చేసిందని, వారి హయాంలో ఉన్న బకాయిలను కూడా తామే చెల్లించాల్సి వస్తోందన్నారు.

42 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.18 వేల కోట్లు జమ చేశామన్నారు. 
 
జీర్ణించుకోలేకే విష ప్రచారం

తాము ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తుండడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి తుమ్మల అన్నారు. వారి ఉచ్చులో చిక్కుకోవద్దని రైతులకు సూచించారు. అధికారంలో ఉన్న పదేండ్లు రైతుల పేరెత్తని ట్విటర్ ​లీడర్​ కేటీఆర్ ఇప్పుడు రైతుల జపం చేస్తున్నారన్నారు.

త్వరలోనే గైడ్​లైన్స్​ రూపొందిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్​

రుణమాఫీలో టెక్నికల్​ ఇష్యూస్​పై రైతులకు అవగాహన కల్పించాలి
ఫిర్యాదులను స్వీకరించాలి 
హుస్నాబాద్​లో అగ్రికల్చర్​ ఆఫీసర్లతో  రివ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు : రూ.2 లక్షలకు పైగా ఉన్న క్రాప్​లోన్ల మాఫీపై త్వరలోనే గైడ్​లైన్స్ రూపొందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రుణమాఫీలో టెక్నికల్ సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తూ, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని తన క్యాంపు ఆఫీసులో వ్యవసాయాధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు దశల్లో రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న లోన్లను మాఫీ చేసిందన్నారు. అంతకంటే ఎక్కువగా ఉన్న రుణాల మాఫీపై విధివిధానాలు రూపొందించి అవి కూడా మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు గురికాకుండా వారి అనుమానాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

2018 డిసెంబర్12 కంటే ముందు, 2023 డిసెంబర్ 9 తర్వాత రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తించదనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ఎలాంటి ఫిర్యాదులు ఇచ్చినా తీసుకోవాలని చెప్పారు. రుణమాఫీపై బ్యాంకుల నుంచి ఇబ్బందులు వస్తే అధికారులు సమన్వయం చేసుకొని రైతులకు సాయం చేయాలని ఆదేశించారు.
  
 

అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు

​​​​​​రాష్ట్రంలోని ప్రతి మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండాలని మంత్రి పొన్నం అన్నారు. అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు రుణాలు తీసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. త్వరలోనే మహిళా సంఘాలతో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి వచ్చే సీజన్ లో పంటలకు నీళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

ప్రాజెక్టు కాల్వల నిర్మాణం కోసం కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం రూ.431.50 కోట్లు విడుదలచేసిందన్నారు. ఇందుకు సంబంధించిన జీవో 209 గురించి ప్రజలకు వివరించాలని, ప్రాజెక్టు పూర్తవుతున్న విషయాన్ని రైతులకు తెలిసేలా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏవోలు, ఏఈవోలు, హార్టికల్చర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
  

హరీశ్ రాజీనామా ప్రజలే కోరుతున్నరు

గజ్వేల్ : రూ. 2 లక్షల పంట రుణమాఫీ చేసినందున గతంలో ప్రకటించిన మేరకు మాజీ మంత్రి హరీశ్​రావు రాజీనామా చేయాలని ప్రజలే కోరుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారంలో ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ తూముకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్​లీడర్లు నిమ్మ రంగారెడ్డి, మోహన్ , బాల్ నర్సయ్య గౌడ్, భాను ప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సందీప్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, సమీర్ పాల్గొన్నారు.

రుణమాఫీ డబ్బులను ప్రభుత్వానికి వాపస్ చేసిన స్పీకర్

వికారాబాద్, వెలుగు :  ప్రభుత్వం నుంచి తన అకౌంట్ లో జమ అయిన రుణ మాఫీ డబ్బులను ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం ప్రకటించారు. తన అకౌంట్ లో జమయిన రూ. లక్షా యాభై వేలను వాపస్ తీసుకుని ప్రభుత్వానికి పంపాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రా ద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వరంగల్‍ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేదల అభ్యున్నతి కోసం  అహర్నిశలు కృషి చేస్తున్న డైనమిక్‍ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మేడం గారి జన్మదినం సందర్భంగా గోపాల నవీన్‍రాజ్‍ అన్నగారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. కొండా దంపతుల ఇమేజ్‍ ఏంటనేది ఈ పంపిణీ చూస్తే అర్థమవుతోంది.

నిజంగా చెప్పాలంటే.. కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఓ అండా.. ఓ ధైర్యం.. ఓ నమ్మకం.. అనేది వరంగల్​లో చూస్తున్నా. ఇతర ఏరియాల్లో ప్రొగ్రాంలు, పండుగల సందర్భంగా అక్కడి లీడర్లు పెట్టే ఫ్లెక్సీల్లో వారి పేరు, హోదా ఉంటుంది. కానీ కొండా వీరాభిమాని అని ఫ్లెక్సీల్లో రాసే ఏకైక నియోజకవర్గాన్ని వరంగల్‍ తూర్పులో మాత్రమే చూస్తున్నా.

అట్లాంటి డైనమిక్‍ ఎమ్మెల్యే మేడం గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం. మేడం గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి’ అంటూ స్పీచ్​ ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి జనాలు ఎక్కువగా తరలిరావడంతో  తోసుకోవడంతో పలువురు గాయపడ్డట్టు తెలిసింది. మరో ఘటనలో కార్యకర్తలు పటాకులుకాల్చడంతో దగ్గర్లో ఉన్న ఓ యువతి గాయపడి రక్తం కారుతుండగా కన్నీరు పెట్టుకుంది.

ఏసీపీ వేడుకల్లో పాల్గొన్న, మాట్లాడిన వీడియోలతో పాటు గాయపడ్డ వీడియోలు సోషల్‍ మీడియాలో వైరలయ్యాయి. దీంతో వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్​ఝా స్పందించారు. ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఏసీపికి మంగళవారం నోటీసులు ఇచ్చారు. దీనికి తోడు సెంట్రల్‍ జోన్‍ డీసీపీ షేక్‍ సలీమా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.