
హైదరాబాద్: త్వరలోనే గ్రూప్4 ఫైనల్సెలెక్షన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టుతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇవాళ గాంధీభవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్4 అభ్యర్థులు మంత్రిని కలిశారు. 2022 డిసెంబర్లో గ్రూప్4 నోటిఫికేషన్ వచ్చిందని, ఫైనల్రిజల్ట్ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఫైనల్రిజల్ట్ను ప్రకటించాలన్నారు. త్వరలోనే గ్రూప్4 అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి, తీపి కబురు అందిస్తమని మంత్రి హామీ ఇచ్చారు.