తన 40ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గోదావరి నీటికోసం పడిన పాట్లను గుర్తు చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లా క్యాంప్ ఆఫీసులో మాట్లాడిన ఆయన.. ఏ ప్రభుత్వంలో పని చేసినా.. ప్రజల కోసమే శ్రమించానన్నారు. నిన్న సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు... మంత్రి తుమ్మలపై కామెంట్ చేశారు. దీనికి కౌంటర్ గా తుమ్మల ఇవాళ రియాక్టయ్యారు. తనను అవమానిస్తున్న నాయకులకు తానేంటో తెలుసన్నారు మంత్రి తుమ్మల.
మేం చేస్తే మీరు బటన్ నొక్కడం ఉండదు. ఆర్నేళ్ల పాలనపై మీ ఏడుపు మీకే వదిలేస్తున్నా.. నేను ఫ్లెక్సీల నాయకుడిని కాదు. నేను కట్టిన వంతెనలు,రోడ్లు నాకే పేరు తెస్తాయి. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు ఇవ్వాలన్నదే నా సంకల్పం. నేను ఓడిపోతే వ్యవసాయం చేసుకున్నా. నన్ను అవమానించిన వారికి నేనేంటో తెలుసు.మేం తప్పు చేస్తే ప్రజలు మాకు బుద్ధి చెబుతారు అని తుమ్మల ఎమోషనల్ అయ్యారు.