పండిన ప్రతి గింజను కొంటాం.. సన్న వడ్లకు బోనస్​ఇస్తాం..

బీజేపీ.. బీఆర్ఎస్​ పార్టీలు రైతులు ఇబ్బంది పడేలా వ్యవహరిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు ఎలాంటి అపోహలు పడాల్పిన పని లేదని.. కాంగ్రెస్​ ప్రభుత్వం పండిన ప్రతి గింజను  కొనుగోలు చేస్తుందని... సన్న వడ్లకు బోనస్​ ఇస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.   రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. 

పోటీపడి కళ్లాల్లోనే సన్నవడ్లు కొంటున్నారంటూ...  సన్న రకాలకు రూ. 500 బోనస్​  చెల్లింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. సర్కార్​ బోనస్​ ప్రకటనతో సన్న వడ్ల సాగు పెరిగింది.. రాష్ట్రంలో  7 వేల 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.  దాదాపుగా ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్​ ఉందన్నారు.

Also Read : కేసీఆర్​.. కేటీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నారు

దేశంలో అతి ఎక్కువ ధాన్యాన్ని  తెలంగాణలో పండిస్తున్నారంటూ .. ఇప్పటికే  9.58మెట్రిక్​ టన్నుల ధా న్యం కొనుగోలు చేశామన్నారు.  ఓపెన్​ మార్కెట్​ లో పెచ్చు ధర వస్తే అమ్ముకోమని రైతులకు చెప్పామన్నారు. గురుకులాలు.. సంక్షేమ హాస్టల్స్​ కు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు.  తెలంగాణలో పండిన ప్రతి గింజ కొంటాం.. రైతులకు ఇన్​ టైంలో చెల్లిస్తామన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో సన్న వడ్ల  సాగును  పెంచామన్నారు. 

ప్రతిపక్ష పార్టీల్లో ఆధిపత్య ధోరణితో రైతులను బీఆర్​ఎస్​.. బీజేపీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిధుల కొరత ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షలు రుణమాణీ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు.