తెలంగాణలో మరోసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన ఖమ్మం, మహబూబాబాద్ .. ఈ భయానక పరిస్థితులనుంచి కోలుకోకముందే మరోసారి ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ( సెప్టెంబర్ 7) సాయంత్రం నుంచి మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.
శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బయ్యారం లోని జగ్న తండా జలమయమయింది. ఇళ్లలోకి నీరుచేరింది. దీంతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి మున్నేరు వాగుకు భారీగా వరద నీరు పెరుగుతోంది. అధికారులు, ప్రజలను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు. అవసరమైన సహాయక శిబిరాలను తెరవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇండ్లనుంచి బయటికి రాకుండా ఉండాలని హెచ్చరిం చారు. అత్యవసరమైతే టోల్ ఫ్రీ నం 1077 కి ఫోన్ చేయాలని సూచించారు.