తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ... బీఆర్ఎస్ పార్టీల్లో కుర్చీల కొట్లాట జరుగుతుందన్నారు. ఈ గొడవలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఈటల అయినా.. మహేశ్వరరెడ్డి అయినా నాకేం సంబంధం అని ప్రశ్నించారు. తనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.తనను అనవసరంగా విమర్శిస్తే ఊరుకోనంటూ.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతానన్నారు.
Also Read:-బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో కుర్చీల కొట్లాట
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తాను ఉన్నానంటే.. మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారో తనకు తెలుసని మంత్రి తుమ్మల అన్నారు. మూసీ ప్రక్షాళనకు సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో రివర్ ఫ్రంట్ఏర్పాటు చేశారు కదా అని ప్రశ్నించారు, మూసీ ప్రక్షాళన జరుగకుండా అభివృద్ది ఎలా జరుగుతుందన్నారు. కూల్చితే ఒకలాగా.. కుర్చిపోతే మరోలాగా మాట్లాడవద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన డీపీఆర్ ఇంకా తాను చూడలేదంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా మూసి అభివృద్ది చేస్తుందన్నారు.