తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..

తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..

ఖమ్మం జిల్లా రూరల్​ మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.  గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి.. అధికంగా వర్షాలు పడుతున్నాయి.. పత్తిలో తేమ ఉంటుంది కాబట్టి.. స్పెసిఫికేషన్ ప్రకారం తేమ శాతం తక్కువుగా ఉండే విధంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు మోసపోకుండా సీసీఐ కేంద్రాల దగ్గర అగ్రికల్చర్ , రెవిన్యూ , మార్కెటింగ్, పోలీస్ అధికారులు  అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు. 

సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేసేవిధంగా చైర్మన్​, ఎండీలకు ఉత్తర్వులు ఇచ్చామని మంత్రి తుమ్మల  తెలిపారు.  ప్రైవేట్​ వ్యాపారస్తులు తూకంతో మోసం చేసే అవకాశాలున్నాయని.. దళారుల చేతిలో మోసపోవద్దని తెలిపారు. తేమ విషయంలో రైతులకు నచ్చచెప్పాలని సూచించారు.  

Also Read :- నీళ్లలో కొండచిలువ ఇరుక్కుంది.. కాపాడిన జలాశయ సిబ్బంది

ప్రైవేట్ వ్యాపారస్తులు సీసీఐ ప్రకటించిన మద్దతు ధరకే కొనాలని మంత్రి తుమ్మల అన్నారు,  ప్రస్తుతం పెట్టుబడి పెరిగి.. దిగుబడి తగ్గిందని... గతంలో ఎకరాకు 10 క్వింటాళ్లు వస్తే .. ఇప్పుడు మూడు, నాలుగు క్వింటాళ్లు రావడం కష్టంగా ఉందన్నారు. వాతవరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పత్తి.. మిర్చి పంటలు పండించే రైతులు హార్టికల్చర్​ వ్యవసాయం చేస్తూ.. పామాయిల్​ పంటను సాగు చేస్తే లాభాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు,  పామాయిల్​ పంటలో అంతర పంటగా మరో పంట కూడా సాగు చేసుకోవచ్చన్నారు.  ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ పంటలను సాగు చేస్తే రైతులు ఆర్ధిక ఇబ్బందులు ఉండవని మంత్రి తుమ్మల అన్నారు.