ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలీ దర్గాలో జరుగుతున్న ఉర్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దర్గాలో చాదర్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దర్గా ముజవార్ షేక్ హబీబున్, సల్మాన్, సాహెబ్ హుస్సేన్, నాగుల్ మీరా, ఖాజా మీయ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆశ్రీఫ్, ఖదీర్, జాకీర్, నవాజ్, షబ్బీర్, సోహెల్ పాల్గొన్నారు.
మంత్రికి వినతి..
విద్యారంగ సమస్యలు పరిష్కరించి కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించాలని కోరుతూ మంత్రి తుమ్మలకు పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. మస్తాన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆదివారం క్యాంపు ఆఫీస్లో మంత్రిని కలిసి సమస్యలను వివరించారు. ఖమ్మం లో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్, మెనూ బిల్లులు విడుదల చేయాలని కోరారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ ఆర్ కాలేజ్ లో పీజీ చదువుతున్న స్టూడెంట్స్కు వేరుగా బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండేలా చూడాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి సభ్యుడు జి.గోపి ఆర్కే సాగర్ తదితరులు పాల్గొన్నారు.