సీతారామ ప్రాజెక్ట్కు 7 వేలకోట్ల ఖర్చు: మంత్రి తుమ్మల

ఖమ్మం: జిల్లాలో10 లక్షల ఎకరాలకు  గోదావరి జలాలు అందించడానికే  సీతారామ ప్రాజెక్ట్ ను చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తెలిపారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామం లో సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ కు ఇప్పటికే 7 వేలకోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు.  ప్రాజెక్ట్ టన్నెల్ రెండు వైపుల నుంచి పనులు చేసి పూర్తి చేయాలని ఆదేశించారు.

 యాతలకుంట టన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి, లంకా సాగర్ కు నీళ్లు అందుతాయన్నారు. గండుగలుపల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే తన రాజకీయ కోరిక అన్నారు.సీతారామ ప్రాజెక్ట్ జిల్లా ప్రజల ఆశ, ఆకాంక్ష అని ఆయన వెల్లడించారు.