రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులు అయ్యి ఉండే ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులందరికి త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని.. ధైర్యంగా వ్యవసాయం చేయండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతాంగానికి భరోసానిచ్చారు. నా తల తాకట్టు పెట్టి అయిన రైతాంగానికి తోడుగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని.. సీఎం మాట ఇచ్చిన విధంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.
ఇవాళ (అక్టోబర్ 3) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్న ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ పండించని విధంగా తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారని కొనియాడారు. రైతాంగం మీద మీకు ప్రేమ ఉంటే అభినందించకున్నా సరే.. కానీ కాళ్లలో కట్టే పెట్టే విధంగా వ్యవహరించకండిని ప్రతిపక్షాలను కోరారు. మోసం చేసే పార్టీలను కాదని ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించారని అన్నారు.
Also Read :- ఢిల్లీలో దోస్తాన.. గల్లీలో కొట్లాట
రుణమాఫీ, రైతు బంధు ఎగ్గొట్టిన పార్టీలు నేడు దగా చేస్తున్నాయని.. వాటిని రైతులు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. సిద్దిపేట ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ఏర్పాటకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్టికల్చర్, ఆయిల్ ఫామ్ సాగులో దేశంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. దేశానికి కావాల్సిన పామ్ ఆయిల్ని తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని నేను కేంద్రానికి చెప్పానని పేర్కొన్నారు.