హైదరాబాద్: చేనేత కార్మికులకు అందరూ అండగా నిలువాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఇవాళ సచివాలయంలో చేనేత, జౌళి శాఖలపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఇప్పటి వరకు టీజీసీవో కి వచ్చిన ఆర్డర్లు.. వాటి పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. 2025-26 ఏడాదికి అవసరమగు వస్త్రాలు ఇండెంట్‌ను టెస్కో కు వచ్చే నెల 15 లోగా ఇవ్వాలని ఆదేశించారు. ఇక చేనేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.