రానున్న రోజుల్లో ఆ పంటతో అధిక లాభం: రైతులకు మంత్రి తుమ్మల సూచన

రానున్న రోజుల్లో ఆ పంటతో అధిక లాభం: రైతులకు మంత్రి తుమ్మల సూచన

భద్రాద్రి: వరిసాగులో తెలంగాణ నంబర్​వన్‎గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రానున్న రోజుల్లో ఆయిల్​పామ్​సాగుతో అధిక లాభాలు వస్తాయన్నారు. కలెక్టర్, ఎస్పీ జీతాల కంటే ఎక్కువగా పామాయిల్​ రైతులు ఆదాయం వస్తుందన్నారు. ఇవాళ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్‎లో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ వేడుకలకు చీఫ్​గెస్ట్‎గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దివంగత సీఎం ఎన్టీఆర్​చొరవతోనే అశ్వారావుపేట అగ్నికల్చర్​కాలేజీ ఏర్పాటు అయిందన్నారు. ఈ కాలేజీ ఏర్పాటు నా కలలకు పంట అని కొనియాడారు. ఎంతోగానో కృషి చేసిన్నట్లుగా ఆయన తెలిపారు. ‘35 ఏండ్ల  కాలేజీ ప్రస్థానంలో 2500 మంది వ్యవసాయ విద్యార్థులు తయారు అయ్యారు. 

రైతులకు మేలు చేసేలా వ్యవసాయ విద్య లో పరిశోధనలు జరగాలి. ఇతర అగ్నికల్చర్​కాలేజీలకు ఆదర్శంగా అశ్వారావు పేట కాలేజ్ ఉండాలి. పంటలకు వాల్యూ యాడెడ్ రావాలంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్ నెలకొల్పాలి. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళిక చేయాలి. ఈ కాలేజీ  ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్త’  అని తుమ్మల అన్నారు.