టెర్రస్ గార్డెనింగ్ కు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి తుమ్మల

టెర్రస్ గార్డెనింగ్ కు  ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి తుమ్మల
  •  పురుగు మందులు లేని కూరగాయలు సాగు చేయాలి
  • మిద్దె తోటల పెంపకం ఉద్యమంలా సాగాలి
  •  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 ఖమ్మం: టెర్రస్ గార్డెనింగ్ కోసం ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహం అందిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫౌండర్ హర్కర్  శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఇవాళ సదస్సు జరిగింది. సదస్సులో  మాట్లాడిన మంత్రి తుమ్మల .. పురుగు మందులు లేని కూరగాయల సాగును మిద్దె తోటల్లో చేపట్టాలని సూచించారు. టెర్రస్ గార్డెనింగ్ లో కూరగాయల సాగుతో కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం పురుగు మందుల అవశేషాలు ఉన్న కూరగాయలతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పారు. అందుకే టెర్రస్ గార్డెనింగ్ ను ఓ ఉద్యమంలా సాగించాలని పిలుపునిచ్చారు. అందుకోసం మహిళలకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని వెల్లడించారు.

'ప్రస్తుతం మార్కెట్లో లో పండ్లు, కూరగాయలు కొనాలన్నా భయం. అందుకే ఇంట్లోనే ఎంచక్కగా నచ్చిన వాటిని కొందరు పండిస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలోని పలు జిల్లాలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యానశాఖ అధికారులు కూడా అర్బన్ ఫార్మింగ్పై దృష్టి పెట్టారు. మిద్దెలమీద సాగుకు జనం జైకొట్టేలా అధికారులు ప్రొత్సహిస్తున్నారు. ప్రజలకు హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ అవగాహన కల్పిస్తోంది. నాంపల్లిలో ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్న కూడా ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా టెర్రస్ గార్డె నింగ్పై ఔత్సాహికులకు శిక్షణ ఇస్తోంది. ప్రతి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహి స్తోంది. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వాట్సాప్ గ్రూపు కూడా ఏర్పాటు చేసింది" అని మంత్రి తెలిపారు.