
ఖమ్మం, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం లో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. బైపాస్ రోడ్డు లోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, రమ కుమార్తె పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
.ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మనవరాళ్ల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. తుమ్మల వెంట నేతలు సాదు రమేశ్‌రెడ్డి, ఎలగొండ స్వామి, జొన్నలగడ్డ రవి ఉన్నారు.