బయ్యారం (మహబూబాబాద్ అర్బన్), వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ బలరాంనాయక్‌ను గెలిపిస్తే బయ్యారాన్ని బంగారు కొండగా తీర్చిదిద్దే బాధ్యత నాదేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. బయ్యారం మండల కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చామన్నారు.
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారం చెల్లించామని చెప్పారు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించి నష్టపోయిన రైతుకు పరిహారం అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ బలరాంనాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, ముసలయ్య పాల్గొన్నారు.