జస్ట్ పలరించుకున్నామంతే.. కేసీఆర్‎ను కలవడంపై మంత్రి తుమ్మల క్లారిటీ

జస్ట్ పలరించుకున్నామంతే.. కేసీఆర్‎ను కలవడంపై మంత్రి తుమ్మల క్లారిటీ

హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎ను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలిశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తుటాలు పేలుతోన్న వేళ ఏకంగా మంత్రి వెళ్లి ప్రతిపక్ష నేతను కలవడం స్టేట్ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది. దీంతో కేసీఆర్‎ను కలవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘‘అసెంబ్లీలో ఆరోగ్యం ఎలా ఉందని కేసీఆర్‎ను మందలించా.. ఆయన కూడా నువ్వు ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అని అడిగారు. మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు.. ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఇప్పుడు హెల్త్ ఎలా ఉందని అడిగానంతే’’ అని మంత్రి వివరణ ఇచ్చారు.  

ఇతరులతో రాజకీయ విభేధాలు తప్పా.. మానవీయ విభేధాలు ఏమి ఉండవని అన్నారు. 1983లో నేను, కేసీఆర్ ఒకే రాజకీయ పార్టీ ద్వారా అరంగ్రేటం చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఆయనతో కలిసి పని చేసిన వ్యక్తి ఎదురుగానే ఉన్నాడు కాబట్టి మానవత్వంతో మాట్లాడానని చెప్పారు. గతంలో నా ఆరోగ్యం బాలేనప్పుడు కూడా కేసీఆర్ నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారని.. అందుకే నేను కూడా ఆయన ఆరోగ్యం గురించి అడిగానని పేర్కొన్నారు. 

ALSO READ | ఫ్యూచర్ సిటీకి భూకేటాయింపులే కీలకం.. ఇప్పటికే 14వేల ఎకరాల సేకరణ

నేను టీడీపీలో ఉన్నప్పటికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో రాజకీయ వైరం తప్పా.. వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండే వాడినని గుర్తు చేశారు. అప్పట్లో నా ఆరోగ్యం క్షీణించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రులు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు నా యోగక్షేమాలు తెలుసుకున్నారని అన్నారు. టీడీపీలో నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ వ్యవహారం మాట్లాడటానికి వచ్చిన విజయ్ మాల్యాకు నా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఇది చిన్న జీవితం.. మనుషులతో మానవత్వంగా వ్యవహరించాలని హితవు పలికారు. కేసీఆర్‎ను కేవలం వ్యక్తిగతంగా కలిశా.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే నాకు శిరోధార్యామని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల.