సీతారామ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ : కొత్తగూడంలో మంత్రుల పర్యటన

సీతారామ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ : కొత్తగూడంలో మంత్రుల పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం అర్థరాత్రి 12 గంటలకు సీతారామ ప్రాజెక్ట్  ట్రయిల్ రన్ టెస్ట్ చేశారు. అశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు దగ్గర ఇరిగేషన్ అధికారులతోపాటు ఆయన మొదటి లిఫ్ట్ ట్రయిల్ రన్ చేసి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ గురించి డీఈ ని ప్రాజెక్టు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు పారేలా యుద్ద ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని తెలిపారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలో పర్యటనించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్ లో గోదావరి వరదలపై అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొననున్నారు.