- తక్షణమే నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు మంత్రి తుమ్మల ఆదేశం
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) పక్కదారి పట్టడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక అధికారులతో లోతైన విచారణ చేపట్టి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారని, బాధ్యుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శక పాలనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.