పార్టీ నిర్ణయం మేరకు కమిటీలు పని చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పార్టీ నిర్ణయం మేరకు కమిటీలు పని చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కష్టపడి పని చేసే కార్యకర్తలకు ఎన్నికల్లో ప్రాధాన్యత
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం

    
ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ నిర్ణయం మేరకు కమిటీలు పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మంలోని వీడీఓఎస్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతీ కార్యకర్త ఛాలెంజ్ గా తీసుకుని పని చేయాలని, అలాంటివారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు.

 ప్రజా ఆమోదం ఉన్న నేతలను ఎన్నికల్లో ఎన్నుకోవాలని సూచించారు.  అవకాశవాదులను నమ్మొద్దని సూచించారు. సొంత పార్టీలో ఉండి, క్రమ శిక్షణ తప్పిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా, రేవంత్ రెడ్డి ధైర్యంతో పాలన సాగిస్తున్నారన్నారు.  మున్నేరు వరద గండం లేకుండా శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి రూ.14 వందల కోట్లు సీఎం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కమర్తపు మురళి, సాధు రమేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.