
తల్లాడ, వెలుగు : మండల పరిధిలోని మల్లారం రోడ్డులో అగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోమాస్ ప్లాంట్ ను బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీలోని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బయోమాస్ ప్లాంట్ నిర్వాహకులు వెనిగండ్ల కిషోర్ మాట్లాడుతూ రైతులు వేసిన మిరప, చెరుకు, వరి, మొక్కజొన్న, తదితర పంటలు పూర్తయిన తర్వాత వేస్టేజ్ ను ప్లాంట్ కు తీసుకొచ్చి విద్యుత్ తయారు చేసే పరికరంగా మార్చి ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.
దీంతో రైతులు తమ పొలాల్లో వేస్ట్ తొలగించేందుకు కూలీలు ఖర్చు తగ్గుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్, నాయకులు రాయల రాము, కాపా సుధాకర్, దగ్గుల రఘుపతి రెడ్డి, సామినేని రామప్పరావు, కటికి కిరణ్, ఆడపా అనిల్ కుమార్ పాల్గొన్నారు.
రాజ్యశ్యామల యాగంలో తుమ్మల
సత్తుపల్లి : సత్తుపల్లి శివారులోని లక్ష్మీ గణపతి ఆలయంలో రాజ్యశ్యామల దశ మహా విద్య యాగం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పురోహితులు తేరాల సుబ్రమణ్య శాస్త్రి సమక్షంలో జరిగిన ఈ యాగంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు చల్లగుల్ల నరసింహారావు, చింతలపాటి సత్యనారాయణ, నున్న రత్నాకర్ రావు ఉన్నారు.
మట్టూరి సీతారత్నానికి నివాళి
కల్లూరు : మండలంలోని లింగాల గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మట్టూరి భద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రెండు రోజులు వ్యవధిలో మనోవేదన కు గురై భద్రయ్య సతీమణి మట్టూరి సీతారత్నం కూ డా ఆకస్మికంగా మృతి చనిపోయారు. దీంతో మంత్రి తుమ్మల బుధవారం లింగాలలోని మట్టూరి భద్రయ్య, సీతారత్నం దంపతుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.