జూపల్లిని జిల్లాకు ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జూపల్లిని జిల్లాకు ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈనెల 12న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలేరు నుంచి పర్ణశాల వరకు ఫీల్డ్ విజిట్ చేయాలని శుక్రవారం హైదరాబాద్​లో ఆయనను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. పాలేరు రిజర్వాయర్ ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని జూపల్లిని తుమ్మల కోరారు.

 కుసుమంచిలోని పురాతన శివాలయం, నేలకొండపల్లి లోని బౌద్ధస్థూపం, భక్తరామదాసు ధ్యాన కేంద్రం, ఖమ్మంలో ఖిలాపై రోప్ వే ఏర్పాటు, లకారం ట్యాంక్ బండ్ పై పర్యటన అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి, వైరా రిజర్వాయర్, కిన్నెరసాని ప్రాజెక్ట్, భద్రాచలం కరకట్ట వద్ద టూరిజం డెవలప్​మెంట్ కోసం నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేయాలని చేయాలని తుమ్మల పేర్కొన్నారు. 

రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన

ఈనెల 11న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమలా పురం వద్ద పంప్ హౌస్ 3ని ట్రయల్ రన్ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత పంప్ హౌస్ వద్ద నుంచి వైరా లింక్ కెనాల్ వరకు మంత్రి ఉత్తమ్ తో కలిసి ఏరియల్ వ్యూ చేయనున్నట్లు తెలిపారు.  ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.