అగ్రికల్చర్​ వర్సిటీ అభివృద్ధికి సూచనలివ్వండి

అగ్రికల్చర్​ వర్సిటీ అభివృద్ధికి సూచనలివ్వండి
  • వరి దిగుబడిలో దేశంలో మనమే నంబర్​వన్: మంత్రి తుమ్మల
  • వర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల లోగో, బ్రోచర్​ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: విద్యా, వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగానికి కాంగ్రెస్  ప్రభుత్వం అధిక  ప్రాధాన్యం ఇస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు విద్యాసంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. ఏం చేస్తే అగ్రికల్చర్​వర్సిటీ అగ్రభాగాన నిలుస్తోందో సూచించాలని అధికారులను మంత్రి కోరారు. 

వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతున్నదని..ఈ వానాకాలం సీజన్​లో వరిధాన్యం అత్యధిక దిగుబడితో  దేశంలోనే నంబర్​వన్​గా నిలిచిందని వెల్లడించారు. డిసెంబర్​20, 21 తేదీల్లో  రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్​వర్సిటీ డైమండ్​జూబ్లీ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల లోగోను, బ్రోచర్లను మంత్రి తుమ్మల మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మన అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోని అన్ని వర్సిటీల కంటే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. 

 వర్సిటీ యాక్టివిటీస్​ మరింత పెంచాలి

స్టేట్​ప్లానింగ్​కమిషన్ వైస్​చైర్మన్​ చిన్నారెడ్డి మాట్లాడుతూ..అమెరికాలోని కాన్సస్​తరువాత అత్యంత ల్యాండ్​ బ్యాంక్​ఉన్నది మన అగ్రి వర్సిటీకేనని తెలిపారు. యూనివర్సిటీ యాక్టివిటీస్​ మరింత పెంచాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రధాని మోదీ 130 కొత్త వంగడాలు విడుదల చేస్తే అందులో మన రాష్ట్రానికి చెందిన ఒక్క వంగడం కూడా లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.