గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : తుమ్మల నాగేశ్వర రావు

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : తుమ్మల నాగేశ్వర రావు
  • అంగన్వాడీ భవనాలను పూర్తి చేయాలి
  • అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం టౌన్,వెలుగు : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మండలంలో పలు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రఘునాథ పాలెం మండలంలో పోడు పట్టాలు జారీ చేసిన గిరిజన రైతులు వారి పొలాల్లో వేసుకున్న బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే జరిగి మిగిలి ఉన్న పోడు భూముల పంపిణీకి చర్యలు తీసుకోవాలని , మండలంలో పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలని చెప్పారు. 

ఎన్.వి. బంజార గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న పొలాల్లో వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పంచాయతీ రాజ్ డీఈ  మహేశ్​ బాబు, ఏ.ఈ.- జే. చిరంజీవి,ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.