రైతులకు అండగా ఉంటాం : తుమ్మల నాగేశ్వరరావు 

మధిర, వెలుగు: రైతులకు  ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మధిర మండల పరిధిలోని  చిలుకూరు గ్రామంలో  వానలు, వరదలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పంటనష్టంపై సర్వే జరిపి రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  మంత్రి వెంట వ్యవసాయ శాఖ ఏడీఏ విజయ్ చందర్,   ఏవో డీఎన్​కే  శ్రీని వాస్ రావు, తహసీల్దార్​ రాంబాబు, ఎంపీడీవో  వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా రైతు బంధు కన్వీనర్ నలమల వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు,  కాంగ్రెస్​ నాయకుడు సూరంశెట్టి కిషోర్​ఉన్నారు. 

 అన్నపూర్ణమ్మ కు నివాళి  

సత్తుపల్లి :  కాంగ్రెస్ మండల నాయకుడు చల్లగుళ్ల నరసింహారావు తల్లి అన్నపూర్ణమ్మ దశదినఖర్మకు మంత్రి తుమ్మల, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి గురువారం హాజరై ఆమె ఫొటోకు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, జిల్లా నాయకులు ఉన్నారు. 

ఎర్రుపాలెం : ఎర్రుపాలెం మండల పరిధిలోని ములుగుమాడు వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి, పామ్ ఆయిల్, మొక్కజొన్న పంటలను మంత్రి తుమ్మల పరిశీలించారు. వర్ష ప్రభావంతో నీట మునిగిన పంటల వివరాలను రైతులు సదరు క్లస్టర్ లో ఉన్న ఏఈవో లను సంప్రదించి రాయించుకోవాలని, రూ. 2లక్షల లోపు రుణమాఫీ అవ్వని రైతులు కూడా ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు వీరయ్య చౌదరి, అనుమోలు కృష్ణారావు, బండారు నరసింహారావు,మల్లెల లక్ష్మణరావు, జేడీఏ పుల్లయ్య తదితరులు ఉన్నారు.