- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మెడికల్ కాలేజ్ బిల్డింగ్ డిజైన్ బాగుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మెడికల్ కాలేజ్ నిర్మాణంపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కాంట్రక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ బృందంతో ఆయన సమీక్షించారు. క్లాస్ రూమ్స్, హాస్టల్ బిల్డింగ్స్, ప్రొఫెస్సర్ క్వార్టర్స్, క్రీడా మైదానలపై కాలేజ్ సూపరింటెండెంట్, లెక్చరర్ల బృందంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
త్వరగా పనులు ప్రారంభించాలని, జిల్లా మైనింగ్ అధికారులతో మాట్లాడుతానని మంత్రి చెప్పారు. మెడికల్ కాలేజ్ కు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని గతంలో ఎవరైతే మట్టి కోసం గుంతలు తవ్వరో, వాళ్లతోనే పూడిపించి చదును చేయించాలని అధికారులను ఆదేశించారు.
రఘునాథపాలెం మండలంలో పర్యటన
ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలంలోని ఈర్లపూడి, మంగ్య తండా, పంగిడి, మంచుకొండ గ్రామాల్లో శుక్రవారం మంత్రి తుమ్మల పర్యటించారు. కార్యకర్తల సమావేశం, వివాహ వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ అధ్యక్షుడు జావీద్, మండల లీడర్లు ఉన్నారు.
కొమ్మినేనికి నివాళి
కల్లూరు : కల్లూరు మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామానికి చెందిన ప్రముఖ రైతు, టీడీపీ సీనియర్ నాయకుడు కొమ్మినేని లక్ష్మీనారాయణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల చండ్రుపట్ల గ్రామానికి చేరుకొని కొమ్మినేని మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆయన వెంట పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుమర్తి చందర్రావు కాటమనేని బాబురావు, లక్కినేనికృష్ణ, పొట్రు సత్యం దిరిశాల నరసింహారావు కాంతారావు, బాబురావు, దేవరపల్లి వెంకటేశ్వరరావు, తాళ్ల వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కొమ్మినేని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.