ఖమ్మం టౌన్, వెలుగు : సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.సోమవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 19వ డివిజన్ ఏకలవ్య నగర్, బోనకల్ రోడ్ నెంబర్-7 లో రూ. కోటి 55 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో ఉండాలని, లెవెలింగ్ సరిగ్గా ఉండాలని అన్నారు. రోడ్డు వెడల్పు వర్క్ ఆర్డర్ ప్రకారం చేపట్టాలని, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ గణేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి వెంకట నారాయణ, కార్పొరేటర్ కమర్తపు మురళీ, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.