విద్యకు ఫస్ట్​ ప్రయార్టీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

విద్యకు ఫస్ట్​ ప్రయార్టీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం టౌన్, వెలుగు :  విద్యా గుమ్మం ఖమ్మం జిల్లా అని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఫస్ట్​ ప్రయార్టీ ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌‌‌‌ ముజామ్మిల్‌‌‌‌ ఖాన్, సీపీ సునీల్‌‌‌‌దత్‌‌‌‌తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 22ఎకరాల్లో లక్షల రూపాయలతో స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని 50 మసీద్‌‌‌‌లకు రూ.50లక్షల నిధులు తక్షణమే కేటాయించాలన్నారు.  అక్షయపాత్రకు సంబంధించి త్వరగా భూమిని గుర్తించాలని చెప్పారు. డంపింగ్ యార్డ్ సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేఎంసీలో శానిటేషన్‌‌‌‌, తాగునీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. అధికారులంతా హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో ఉండాలని, కిందిస్థాయి సిబ్బంది విధుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదన్నారు.జిల్లాలో మైనింగ్, గంజాయి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. 

పనులు నాణ్యతతో చేపట్టాలి

ఖమ్మం నగరంలోని 20వ డివిజన్ లో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. 20వ డివిజన్, సాయి నగర్ లో టీయూఎఫ్, ఐడీసీ నిధులు రూ. 50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పెద్ద సంఖ్యలో చెట్లు పెంచి గ్రీనరీ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు బి. ప్రశాంత లక్ష్మి, కమర్తపు మురళీతదితరులు పాల్గొన్నారు.